Sunday, March 1, 2009

ఎంటీవోడు తొంగున్నాడు...... ఇంటరవెల్ కయినా లేస్తాడా!

ఉదయం 6.30 కి నిద్ర లేచి,ఇంట్లొ భార్యకి పనులలో చేయికలిపి, పిల్లలిని స్కూల్ దగ్గిర డ్రాప్ చేసి, అదరా బదరా గా ఆఫీసుకెల్లెసరికి లేటౌతుంది, లేటుగా వచ్చినందుకు సంజాయిషి చెప్పుకుని పని మొదలెట్టేసరికి క్లయింటు దగ్గరనుండి ఫొను వస్తుంది,ఆ పని ముగించుకునే సరికి పిల్లవాడు స్ఖూల్లో ఎదురుచూస్తూ ఉన్న విషయం గుర్థుకు వస్తుంది, పరెగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఇంటిదగ్గిర దిగబెట్టి భొంచేయటానికి టయములేక ఎదో తిన్నామనిపించుకొని పరుగు పరుగున ఆఫీసుకి వచ్చి పని ముగించుకొని వెళ్ళేసరికి సాయంత్రం ఎనిమిది దాటుతుంది......హా!
చూసారా ఇదంతా చెప్పటానికీ నాకు, వినటానికి మీకే ఇంత అలసటగా అనిపిస్తే రోజూ అలా చస్తూ బ్రతుకుతూ ఉన్న మనం ఇంత అలసిపోతూ ఉన్నాం?ఇక ఏదయినా మనకోసం మనం చేయటానికి,చూడటానికి ఇక టైమెక్కడది? అందుకే మన చుట్టూ ఏమి జరిగుతుందో కనీసం చూసో ,వినో ఎంజాయి చేయలేకపొతున్నాం.ఎప్పుడైనా పాత గ్నాపకాలని గుర్తు చేసుకున్నా, ఎప్పుడో జరిగిన సంఘటనలు చదివినా మనం ఎదో తెలియని ఆనందానికి గురౌతూ ఉంటాం. అందుకే ఆనాటి మరుగున పడిన ఒక పాత సంఘటనని మీముందు ఉంచుతున్నాను చదవండి...!
* * *
మనకి తోటరాముడు అన్నపేరు వినగానే జగత్ విఖ్యాతి గాంచిన పాతాళభైరవి సినీమా,అందులో నాయకుడు యన్.టి.ఆర్, మాయల మాంత్రికుడు యెస్ వీ రంగారావు గుర్తుకి వస్తారు, అలాగే అటువంటి గొప్ప సినిమాని నిర్మించిన నాగిరెడ్డి , చక్రపాణి లు గుర్తుకు వస్తారు. పాతాళభైరవి ఇచ్చిన స్పూర్తితో విజయా వారు రెండో జానపద సినిమా కి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి సరిగ్గా ఈ సంఘటన జరిగి 60 సంవత్సరాలు అయింది. పాతాళభైరవి సినిమాకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షక దేవుళ్ళకి ఈ సినిమా ద్యారా ఎక్కడలేని ఆనందాన్ని అందించాలని భావించారు.అనుకున్నట్లుగానే నిర్మాతలకి మంచి స్టోరీ దొరికింది.ఈ సినిమాకు పాతాళభైరవి సినిమాకి అసొసీఎటు దర్సకుడుగా పనిచేసిన కమలాకర్ కామేశ్వరరావు కి దర్సకుడిగా ప్రమోటు చెసారు.ఆ స్క్రిప్టు మీద సంవత్సరం పాటు పనిచేసిన తరవాత వాళ్ళకి నమ్మకం కుదిరింది,ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫ్ బొనాంజా ఔతుందని అందరూ భావించారు.ఈ సినిమాకి " చంద్రహారం " అనిపేరు పెట్టారు, దానికి గాను హీరో యన్.టి.ఆర్ ని, హీరోఇన్ గా శ్రీరంజనీ ని సెలెక్టు చేసారు.
* * *
ఇక కధలోకి వెళితే చందన రాజ్యం మహారాజుకి పుత్ర సంతానం కలగదు, ఒక మహ ముని పూజా ఫలము తో వారికి పుత్ర సంతానం కలుగుతుంది, అతడే చందన యువరాజు.చందనకి యువరాజు ప్రతిరోజూ ఒక కల వస్తుంది ఆ కలలో తన హ్రుదయ రాణి కనిపిస్తుంది, అలా ఒక మంచి రోజు యువరాజు ఆ పల్లె పడుచుని పెళ్ళి చేసుకొని యువరాణి ని చేస్తాడు.అనుకోకుండా ఒక రోజు దేవ కన్య యువరాజు మీద మనసు పారేసుకుంటుంది,తనని పెళ్ళాడమంటుంది,చందన యువరాజు అప్పటికే వివాహితుడయినందున ఆమె కోరికని తిరస్కరిస్తాడు,అంతె ఆ దేవ కన్య యువరాజు దంపతుల మీద కక్ష గట్టి వాళ్ళని ఇబ్బందులకి గురిచేస్తుంది, చివరికి యువరాణి పూజా ఫలముతో యువరాజు కష్టాలు గట్టెక్కి కధ సుఖాంతం ఔతుంది. 1950 చివరి లో షూటింగ్ మొదలయింది, ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి మనసు దోచేలాగ చిత్రీకరించారు,ఆ సినిమాకోసం దాదాపు 51 సెట్టులు వేసారు, అప్పట్లో ఈ సినిమిమా షూటింగ్ విషేషాలని కధలు కధలుగా చెప్పుకునే వారు.నాగిరెడ్డి, చక్రపాణీ లు వాళ్ళ దగ్గరున్న మొత్తాన్నీ చంద్రహారం సినిమా కోసం వెచ్చించారు.అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కోసం జనాలు దొరకటం కష్టమయ్యేది, ఒక సారి రాజ దర్బారు సెట్టింగ్ షూటింగ్ కి 1000 మంది కావలిసి వచ్చింది.అంత మంది జనాలు మద్రాసు మొత్తం గాలించినా దొరకరని అర్ధమయింది.నాగిరెడ్డి,చక్రపాణీలు జనాలని వెతకలేక విజయా స్టూడియొలో ఉన్న అందరిచేత మేకప్ వేయించారు, ఆసమయంలో టీ సప్లయి చేసే వాళ్ళు లేక నిర్మాతలే యూనిట్ సబ్యులకి టీ సర్వు చేసారు.
* * *
అటువంటి కస్టాలెన్నో పడి మొత్తానికి 1952 సినిమా ని పూర్తి చేసారు. రషెస్ చూసిన వాళ్ళందరూ మరొక మహ కావ్యం ఔతుందని భావిచారు.నిర్మాతలయిన నాగిరెడ్డి,చక్రపాణీలు ఆనందానికి అంతే లేదు.1952 ఏప్రిల్ 24 న చంద్రహారం సినిమా రిలీజయింది, ఆ రోజు నిర్మాత నాగిరెడ్డి వాళ్ళ ఊరు లో కూడా సినిమా రిలీజ్ అవటం మూలాన స్వయంగా సినిమా హాలుకెళ్ళి ప్రేక్షకుల స్పందనని చూడాలనుకున్నరు అనుకొవటమే తరువాయి మొదటి షో లో ప్రత్యక్షమయ్యరు.సినిమా మొదలయింది 10 నిమిషాలు గడిచాయి, 20 నిమిషాలు, 40నిమిషాలు కానీ జనాల దగ్గరినుంచి ఎటువంటి రెస్పాన్సు కనపడలేదు, ఈ లోగా పక్కన కూర్చున్న వాళ్ళు ఆ ఇద్దరు నిర్మాతలని గుర్తు పట్టారు, వాళ్ళల్లో ఒకడు లేచి సినిమాలో ఎంటివోడు తొంగుని నిద్దరోతున్నాడు... ఇంటర్వెల్ కయినా నిద్ర లేస్తాడా!.. అని అడిగాడు.. అంతే నాగిరెడ్డి,చక్రపాణీ ముఖాల్లో నెత్తుటి చుక్క కరువయింది.వాళ్ళ అమ్మవాళ్ళ ఇంటికి కూడా పోకుండా సరాసరి మద్రాసు చేరుకున్నరు.వాళ్ళు ఏమనుకొని సినిమాని నిర్మించారో అది పూర్తిగా ప్రేక్షకుడి ఆలోచనలకి వెతిరేకంగా తయారయ్యిందని అర్ధమయింది. చంద్రహారం సినిమా అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్లాపు గా చెప్పుకున్నారు. పాతాళ భైరవి సినిమాకి వచ్చిన డబ్బు, పేరూ చంద్రహారం సినిమాతో కొట్టుకు పొయాయి. ఛంద్రహారం సినిమా నాగిరెడ్డి,చక్రపాణీలకి అక్షరాల 25 లక్షలు నస్టాన్ని కూడగట్టింది. 60 సంవత్సరాల కిందట 25 లక్షలు అంటే ఇప్పటి రోజున అది ఎంత పెద్ద మొత్తమో మనం ఊహించ వచ్చు.
* * *
నాగిరెడ్డి,చక్రపాణీలు ప్రాక్టికల్ గా తెలుకున్నదేమిటంటే మనం చేసే ప్రతి పనిని పట్టుదలతో,అకుంటిత దీక్షతో చేస్తే సరిపోదూ, మనం చేసే పనిలోని మంచిని చెడుని మన కళ్ళతో చూడటమేగాకుండా ఎడుటివారి ద్రుష్టిని బట్టి కూడా ఆలోచించాలి అప్పుడే మనం చేసే ప్రతి పనిని, సక్సెస్ వైపుకి మళ్ళించ వచ్చు.
ఇంగ్లీషులో ఒక వాక్యం ఉంది.... " Think outside the Box".