Sunday, February 15, 2009

అమెరికా – అమెరికా


ఎప్పటినుంచో అనుకుంటున్న డేట్ రానే వచ్చింది.డిసెంబర్ 30 2008.ఆ రోజు కోసం దాదాపుగా పిల్లవాడు ఎక్జాం డేట్ కోసం ఎదురు చుసినట్లు ఎదురు చుస్తూ ఉన్నాను.నిజానికి ఆ రోజే నా ఇండియా ప్రయాణం. నా ప్రాజక్ట్ మేట్…కంగారు పడకండి ఇదేంటి స్కూల్ మేట్,క్లాస్ మేట్ లాగ ప్రాజక్ట్ మేట్ ఎంటా అనుకుంటున్నారా అదేనండీ సహ ఉద్యోగి, నా ట్రిప్ డేట్ గురించి మురళీ రోజూ కౌంట్ డౌన్ చెపుతూ ఉంటాడు, నేను మర్చి పోయినట్లు నటిస్తాను నిజానికి నేను మర్చిపొయేది ఒక్క నిద్రలో మాత్రమె!..
* * *
రెండు వారాల ముందునుంచే మా ఇంట్లో హడావిడి మొదలయింది,నా భార్య లెక్కలువేసి తేల్చి చెప్పింది ఈ ట్రిప్ లొ నెనెంత ఖర్చు పెట్టబొతున్నానో. మా పిల్లలు అప్పుడే బెంగని నటించి దానిలో కసేపు జీవించి, నేను ఇండియా వెల్లినప్పుడుండే బాధని, నేను తిరిగి వచ్చేటప్పుడు తెచ్చే భొమ్మలను ఊహించుకొని ఆనందాన్ని, మొత్తం మీద బాధానందాన్ని పొందారు.ఈ ట్రిప్ కొసం చాలా శ్రమలే పడ్డాం, దాదాపుగా ఆరు సంవత్సరాల తరువాత ఇండియా వెలుతున్నాను. చుట్టాలు, ఫ్రెండ్స్ నా నుండి మంచి గిఫ్ట్లు ఎక్ష్పెక్ట్ చెస్తారని తెలుసు.అందుకె పేరు పేరున వాళ్ళ కి ఏమి కావాలో అడిగి తెలుసుకొని షాపింగ్ చేసాను.అప్పుడర్థమయింది ఇలా కొంటూ పొతే నా జేబు బరువు సరిపోదని.ఈ విషయాలన్ని నా భార్య ముందే ఎలక్కి చెప్పినట్లు చెప్పింది, మనం వినే రకం కాదు కదా.ఎదో నాకు వీలైనంతలొ అందరికీ మంచి గిఫ్ట్లు కొనాలనుకున్నాను.నాకొక ఆలొచన వచ్చింది నా ఫ్రెండ్స్ నన్ను చుడాలనుకుంటున్నరా లేక నే తెచ్చే గిఫ్ట్స్ కొసమే చుస్తున్నరా అని, ఈ ఆలొచన చాల త్రిల్లింగ్ గా అనిపించింది, చుడాలి అక్కడికి వెల్లిన తరువాత.అలా ఎందుకనుకున్నా నంటే ఈమద్యనే నా ఫ్రెండొకడు ఇండియా వెళ్ళొచ్చాడు, వాడు చెప్పినదానిపట్టి ఛుట్టాలు అక్కడున్న వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ అన్నీ మనీ రిలేషన్స్ అయిపొయాయని అంటే మనకొసం కాదు మనదగ్గరున్న దబ్బుకొసం చూస్తున్న్నారని వాడర్ధం,నేను దాన్ని తప్పని ప్రూవ్ చేయాలనుకున్నాను.
* * *
ఉదయం ఎప్పటిలాగానే ఎనిమిదికి నిద్ర లేచాను ..కాదు,కాదు నా భర్య నిద్రలేపింది. ఎందుకో మా ఆవిడకి నేను లేటుగా నిద్రలేవటమే ఇస్టం.ఈ విషయం గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాను, నాకది లేటుగా అర్ధమైది, నేను ఉదయాన్నే లేస్తే తనని పిల్లలతో ఫైట్ చెయనివ్వను,నేను కూడా పిల్లలివయిపే మాట్లాడతాను. అందుకే వీడు నిద్రపొవటమే మంచిదనుకుంటుంది.పైకి మాత్రం ఎలాగూ ఆఫీసులో బాగా వర్కు ఉంటుంది కదా ఎక్కువ నిద్ర కళ్ళకి మంచిదని చెప్పేది. ఈ రోజే నా ఇండియా ప్రయాణం, చాలా ఏళ్ళ తరువాత ప్రయాణమనేమో ఏదో తెలియని బాధ, కాదు భయం …..ఏమో నాకే తెలియటం లేదు. నా మనసు మనస్సు లో లేదు(ఈ స్టేటెమెంట్ ఎక్కడో చదివినట్లు గుర్తు.. మాచ్ అవకపోయినా వాడేసా). అలాగే అఫీసుకు వెళ్ళాను,కాసేపు మెయిల్స్ చూసాను అప్పటికీ అలానే ఉంది పక్కనే కూర్చున్న గంగిసెట్టి ముసి ముసి నవ్వులు నవ్వుతూ రవితో అంటున్నాడు, సింగడు పోక పోక ఇండియా ఫోతే ఇలానే ఉంటుందని. ఆ తరువాత నాకర్ధమయింది ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకున్నానో, ఇలా నా ఇండియా ట్రిప్ కోరిక నెరవేరబొతున్నందుకు ఒక్క సారిగా నా మనసు ఆలోచించటం మానేసింది.అందుకే ఈ తెలియని అలజడి. చక చకా ఆఫీసు పనులు ముగించుకొని బయటపడ్డాను.సరిగ్గా 2 గంటలకి గంగిసెట్టి వాన్ ఇంటి ముందు ఆగింది, వస్తునే లగేజి బరువు గురించి అడిగి తెలుసుకొని హడావిడి పెట్టాడు, సమయానికి సమత మంచి కాఫీ సరువు చేసింది, వేడి కాఫీ గొంతులో పడంగానే కాస్త నెమ్మదించాడు. లగేజి కార్లో పెట్టాం, నా భార్య పిల్లలు చాలా హాపీగా సెండాఫ్ చెప్పారు.వాళ్ళు ఆనందంగా సెండాఫ్ చెప్పటం చూసి ఉత్సాహంగా ఏర్పొర్టుకి బయలుదేరాం.
* * *
గంగిసెట్టి వాన్ రొడ్డూమీద వేగంగా పరిగెడుతుంది నా మనసులోని ఆలొచనలు లాగా. పెద్దాయన డ్రైవింగ్ కస్టాన్ని తగ్గించటం కొసం అన్నట్లుగా నేను కబుర్లు మొదలెట్టాను.చాల మంది ఫ్రెండ్స్ కి సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడలేరు,నా మూడ్ తెలిసి మాట్లాడటంలొ గంగిసెట్టి ముందు వరసలో ఉంటాడు.ఎదుటి వాళ్ళని సహాయం అడగటం అంటే నాకు ఫ్రాణ సంకటం,అది తెలిసిన వాడుగా నేను అడగకుండానే ఏర్పొర్టు లొ దించుతానని ఛెప్పి వప్పించాడు. దారిలో చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం, అలా మాటల్లో పడేసరికి టయమే తెలియలేదు. ఈలొగా ఏర్పోర్టు రానే వచ్చింది. డ్రాప్ చేసినందుకు క్రుతఘ్నతలు చెప్పి లోపలికి బయలు దేరాను. కొంచం ముందుగా వచ్చానేమో 10 నిమిషాలలొ లగెజి చెకిన్ అయిపోయింది.
* * *
సెకురిటీ చెక్ అయిపోయిన తరువాత ఫ్రాంకుఫొర్ట్ వెళ్ళే విమానం ఉన్న గేటు చూసుకొని అక్కడ తిస్ట వేసాను.ఎంత సేపటికి ఫ్లయిటు టయం అవ్వటం లేదు,గడియారంలో నిమిషాల ముల్లు తాపీగా అప్పుడే భోంచేసి వచ్చినట్లుగా నిదానంగా కదులుతుంది,ఇక చిన్న ముల్లు సరెసరి డెట్రొఇట్ మంచులో కూరుకు పోయిన కారులాగా కదలడానికి ససేమిరా అంటుంది. నాకేమో అసహనం పెరిగి పొతుంది, ఇక లాభం లేదని ఇంటికి ఫొను చేద్దామని బయలు దెరాను.ఫొను రింగవ్వగానే నా కాల్ కోసమే ఎదురు చూస్తుంట్లుగా, మా ఆవిద ఫొను తీసింది నేను ఫోను లొ మాత్లాడుతున్నాను ఎవో ప్రశ్నలు అడుగుతుంది గాని నా ద్యాసంతా ఎప్పుడు విమానం బయలు దేరుద్దాని ఆలోచనలో ఉండి పోయాను.ఒక్కసారిగా ఉలిక్కిపడి తేరుకున్నాను.అవతలనుంచి నా చిన్నకూతురు ఫొను లో తుఫాన్ వచినట్లుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, ఎవో కొన్నిటికి సమాధనాలు చెప్పి ఫోను పెట్టేసి తిరిగి గేటు దగ్గరికి వచి కూర్చున్నాను. నా బాధనంతటిని ఆలకించిన దేవతలాగా ఎనఔన్సర్ ఎనఔన్సు చేసింది, ఫ్రాంకుఫొర్ట్ వెళ్ళే ఎర్ర బస్సు…. ఒహ్..సారి ఎయిర్బస్సు బోడింగు మొదలయిందని. చక చకా బాగ్ తీసుకొని ముందు వరసలో అందరికంటే ముందువరసలో నిల్చున్నాను.అంత పంక్చువల్గా ఆఫీసుకు వెళ్ళటం అలవాటుచేసుకొని ఉంటే 'సారీ' అనే పదం నా జీవితంలో చాలా వాడనవసరం వచ్చేది కాదు. అనుకున్నట్లుగానే అందరికంటే ముందుగా ఫ్లయిటు లోకెళ్ళి కూర్చున్నాను, కొంచెం ముందూ వెనుకగా అందరూ వారి సీట్లలో వచ్చి కూర్చున్నారు. ఈ సారి ఇంకే ఆలస్యం లేదు బయలు దేరడమే తరువాయి అనుకున్నాను, పైనున్న పెద్దాయన నా మనసులోమాటని చదివినట్లుగా, పైలెట్ అనౌంచెమెంట్ వినిపించింది,సాంకేతిక లోపం వలన ఫ్లయిటు బయలుదెరడానికి ఇంకా 40 నిమిషాలు పడుతుందని,పయిలెట్ ఫ్లయిటుని సరాసరి రిపేరు సెక్షన్ కి తీసుకుపోయాడు,అప్పుడనుకున్నా 'తానొకటి తలస్తే దైవమొకటి తలచాడంటారు ' ఇదేనేమోనని.చేసేది లేక నా వెంట తీసుకొచ్చిన యం. ఫీ. త్రీ ని ఆన్ చేసాను, ఒల్డ్ ఇలయరాజా పాటలు మధురంగా వినిపిస్తుంటే అలా కళ్ళు మూసుకున్నాను. ఫ్లయిటు ఎప్పుడు రిపేరు అయిందో, ఎప్పుడు బయలుదేరిందో గాని కళ్ళు తెరిచేసరికి ఫ్లయిటు గాల్లో ఉంది.ఈ లోగా ఎయిర్హొస్టెస్ కూల్ డ్రింక్స్ పట్టుకొని వచ్చింది. ఎందుకో రీసన్ తెలియదు గాని చిన్నప్పుడు బస్సులో ప్రయానం చేస్తున్నప్పుడు చూసిన షోడాలు కొట్టేవాడు గుర్తుకు వచ్చాడు, ఒక కలర్ షోడా…..సారి కోక్ అడిగి టీసుకున్నా. అలా రంగుషోడాలమ్మాయి రకరకాల అయిటంలు తెస్తూనే ఉంది,తెచ్చిన ప్రతీ అయిటం తీసుకుంటునే ఉన్నాను. తింటూ, టీవీ చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో గుర్తు లేదు కాని పయిలట్ అనౌంచెమెంట్ తో మెలుకువ వచ్చింది.అలా చుస్తుండగానే ఫ్రాంక్ఫొర్ట్ లో దిగిపోయాను. నెత్తిమీద రెండు మూడు కాబిన్ బాగ్ దెబ్బలు తిన్న తరువాత అతి కస్టం మీద ఫ్లయటు లోనించి బయట పడ్డాను.అక్కడ నుండి హయిదరాబాదు వెళ్ళే ఫ్లయిటు ఉన్న గేటు వైపు నడుస్తూ ఉన్నా, దూరం నుంచి ఎవరో పిలుస్తునట్లు అనిపించింది. కాని మనసులో అనిపించింది,ఆరు సంవత్సరాలుగా ఒకే ప్లేసులో ఉంటూ పనిచేస్తూ ఉన్న ట్రాయి లోనే నన్నెవరూ గుర్థుపట్టరు, ఇక్కడెవడుంటాడాని,అదీగాక మా కాఫీ బాచ్ చెంచు, శైలజా,మహెష్, మురళీ కూడా ట్రాయిలోనే ఉన్నరాయ.ఏదో సినిమాలో చుపించినట్లు ఇది బ్రమే అనుకుంటూ ముందుకడుగు వేసా,వెనుకనుంచి నా భుజం మీద ఎవరో చేయి వేసి. ఏరా వీరూ అంటూ పలకరిస్తున్నాడు ఒక్క క్షనం అతన్ని పోల్చుకోలేకపోయాను కానీ అతనికే పరిమితమయిన స్టయిల్ చూసి గుర్తు పట్టాను.నేను బెంగుళూర్ లో జాబ్ చెస్తున్నప్పూడు పరిచయమయ్యాడు,అతనిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది ,నా జర్నీ లో కలవాలిసిన మంచి మిత్రులు అక్కనుండే మొదలయినట్లుగా అనిపించింది.నా ఎర్ర బస్సు బయలుదేరటానికి చాలా టయిము ఉందటం వలన ఇద్దరం కూర్చుని పాత గ్నాపకాలన్నీ ఒక్క సారి చుట్టి వచ్చాం, ఈ లోగ నా చెకిన్ టయిము అవ్వటం తో అతని దగ్గిర సెలవు తీసుకొని వెళ్ళి ఫ్లయిట్లో కూర్చున్నాను.
* * *
అనుకున్నట్లుగానే ఈ సారికూడా చిట్టచివరి సీట్ అలాట్ అయింది,చేసేది లేక వెనుక నుండి కౌంట్ చేస్తే నాదే మొదటి సీటు కాబట్టి అలా సీటులో సెటిల్ అయ్యాను.ఈ సారి కూడా ఏ జర్మనీ తాతో లేకపొతే చెన్నై అవ్వో నా పక్క సీటులోకి వస్తారని ఎదురుచుస్తూ ఉన్న.ఈ సారికూడా నామనసులో మాటని పైన పెద్దాయన ఇట్టే చదివేసాడు.ఒక చిన్న బాగ్ తీసుకొని, బొడింగుపాస్ చేతిలో పట్టుకొని తన దగ్గిరున్న నంబరుతో ప్రతి సీట్ నంబరు పోల్చి చూస్తూ ఒక అమ్మాయి వస్తూ ఉంది, అలా వెలుతూ నా దగ్గిరకొచ్చి ఆగిపోయింది. అంకున్నా కస్టాలు మొదలయ్యాయని.మామూలుగా తెలిసిన ఆడవాళ్ళతో మాట్లాడటమే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాంటిది పరిచయం లేని అమ్మాయితో కలిసి ఎనిమిది గంటలు కలిసి ప్రయాణం చేయాలి.పది నిమిషాలు మౌనంగా కూర్చున్నాను, చాలా ఇబ్బందిగా అనిపించింది, ఇక నా వల్ల కాలేదు నిశ్శబ్ధాన్ని బ్రేక్ చేస్తే గాని ప్రయాణం ప్రసాంతంగా చెయగలననిపించింది, ఆ ఆలోచన రాగానే మనస్సు కాస్త తేలిక పడింది కానీ ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు,నా బాధ నంతటినీ అర్ధం చెసుకున్నట్లుగా ఆ అమ్మాయే మాటలు కలిపింది.ఊరు, పేర్లు అయినతరువాత కాస్త నమ్మకం కుదిరినట్లుంది ఇంకా మాటలు కంటినూ చేసింది. తను ఎప్పుడు అమెరికా కి వచ్చింది ఎక్కడ చదివింది, ఎక్కడ జాబ్ చేస్తుంది అంతా వివరంగా చెపుతూ ఉంది. ఆ అమ్మాయిది విజయవాడ అట, నేను వినిన దానిని బట్టి విజయవాడ అమ్మాయిలు ఛాలా ధయిర్యవంతులు, ఆ విషయం ఆ అమ్మయిని చూస్తే ఇంతకుముందు తెలియనివారికెవరికైఇనా ఇట్టె బోధపడుతుంది.తను బీ.టెక్ చేసి యం.యెస్ కి వచ్చింది,ప్రస్తుతం ఇప్పుడు జాబ్ చేస్తుంది.కానీ ఆ అమ్మాయి ముఖం లొ ఇండియా వెలుతున్నందుకు ఉండవలిసిన ఆనందం కనిపించలేదు అదే విషయాన్ని ఆ అమ్మయిని అడిగాను, అప్పుడు చెప్పింది అమెరికా మాంద్యం యేక్క ఇంపాక్టు తనమీద కూడా పడ్డదని తన జాబ్ పోయిందనీ మల్లి ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదంటూ వాపోయింది. ఇదంతా విన్న తరువాత ఆ అమ్మాయి మీద మంచి అభిప్రాయం కలిగింది, జాలి గూడా వేసింది. ఈలొగా షొడాలమ్మాయి వచ్చింది, నాకు ఎప్పటినుంచో ఫ్లయిటులో వెలుతున్నప్పుడు వైను తాగాలని ఒక చిన్న కొరిక ఉంది, కానీ ఇన్ని కస్టాలు ఉన్న అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇక వైను తాగాలనిపించలేదు అందులోనూ పెద్దవాడిని హుందాగా ఉండాలని నిర్నయించుకున్నాను.షొడా లమ్మాయినడిగి ఆరంజ్ జూసు తీసుకున్నాను, పక్కన అమ్మయి కూడా కొక్ అడిగి తీసుకుంది.కొద్దిసేపటి తరువాత ఇడ్లీలమ్మే బండివాడు వచ్చాడు ఒక వేళ ఆ అమ్మాయి వెజిటరియన్ అయితె నేను చికెన్ తింటుంటె బాగుండదని నాకెంతో ఇస్టమయిన చికెన్ మీల్ వద్దని వెజు మీల్ అడిగి తీసుకున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఫాలో అయింది,ఆ అమ్మయి వెజు తీసుకోవటం చూసి నా గెస్సు కరెక్ట్ అయినందుకు ఆనందంగా నిద్రలోకి జారుకున్నా.ఎవరో తట్టి లేపుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా షొడాలమ్మాయి ఎం కావాలని అడుగుతుంది ఎమి లాభం ఎలాగూ వైను తీసుకొలేను, ఆ ఆలొచన రాగానే ఒక్కసారి నీరసంగా అనిపించింది చేసేది లేక ఈ సారి వెరైటీగా ఉంటుందని ఇందాక ఆ అమ్మాయి ఆర్డర్ చేసిన కోక్ ఆర్డెర్ చెసా. ఇక ఆ అమ్మాయి వంతు వచ్చింది, అప్పటికే ఆ అమ్మయికి అర్ధమయిందనుకుంటా, వీడు కన్నాంబకెక్కువ కాంచనమాలకి తక్కువని రెడ్ వైను ఆర్డర్ చేసింది ఆ వెంటనే చికెన్ మీల్ ఆర్డర్ చేసింది, అంతే అదిచూసి మళ్ళీ నాకు నిద్ర ముంచుకొచ్చింది.
* * *
ఒక పెద్ద కుదుపుతో ఫ్లయట్ ఆగిపోయింది, వచ్చెసాం ఇందియా వచ్చేసాం కాబిన్ బాగ్ తీసుకొని బయట పడ్డాను, అదే ఊపులొ బాగేజి సెక్షన్ కెల్లి కస్టంసు దగ్గిర నా నా కస్టాలు పడి ఆత్రంగా బయటకి పరెగెత్తాను, దూరం నుంచి విష్ చేస్తూ చిన్నా,ఫణి,సుబ్బా పరెగెత్తుకుంటూ వస్తున్నారు.వాళ్ళ పలకరింపులు చుట్టూ గుమిగూడిన జనాన్ని చుస్తుంటె అనిపించింది ఖచ్చితంగా ఇలా ఎప్పటికి అమెరికాలొ జరగదని.నిజంగా ఆ కోలహలం, జనాల సందడి అమెరికా జీవితంలొ మిస్సౌతూ వస్తున్నాం. ఈ లోగా చిన్నా కారు పిలిపించాడు, అమెరికాలొ పెద్ద పెద్ద కారులు చుదటం వల్లేమొ మేమెక్కిన కారు చాలా చిన్నదిగా అగ్గెపెట్టె లాగా అనిపించింది.మెమెక్కటమే ఆలస్యం డ్రైఇవర్ వాడికే అలవాటైన రోడ్డు మీద అగ్గెపెట్టె కారుని పరిగెత్తించ్చాడు. మేము ఇంటికి చేరుకునే సరికి అంతా సిద్దంగా ఉంది, దెసెంబర్ 31 రాత్రి సంబరాల కేకు నాకు వెల్కం చెపుతున్నట్లు రడీగా ఉంది.ఆనందంగా కేకు కట్ చేసి విషెస్ చెప్పుకున్నాం. కొన్ని ఏళ్ళ తరువాత వాళ్ళందరినీ చుస్తున్నాను, నా ఆనందానికి అవధులు లేవు, అలా తెల్లవార్లూ మాట్లాడుతూ కూర్చుండిపోయాం. ఇందియా రోడ్ల మీద నడిచి చాలా ఏళ్ళైందేమో ఎప్పుడు బయటకి పొదామా అనిపిస్తుంది.బ్రెషప్ అయి ముగ్గురం కాఫీ కి బయలుదెరాం,జనవరి నెల ఉదయాన్నే అలా రోడ్డు మీద వెలుతుంటే,మనసుకి చాలా హాయిగా అనిపించింది,కొద్దిగా పొగమంచు చల్లగా గాలితాకుతుంటె నాకెంతొ ఇస్టమైన గీతంజలీ పాట గుర్తుకొచ్చింది. చిన్నా స్పెషల్ టీ ఆర్డర్ చేసాడు,అలా రోడ్డుమీద నిలబడి టీ తాగి చాలా రొజులయిందేమో టీ చాలా మధురంగా అనిపించింది. స్నానాలు అయిన తరువాత షాపింగ్ కి బయలు దేరాం,దాహంగా అనిపిస్తే దగ్గిరలొ బొండాలోడి దగ్గిరికి వెళ్ళి ముగ్గురం బొండా తాగాం, అక్కడ కొబ్బరి బోండా రేటు విని షాక్ అయ్యాను, నాకు తెలిసి ఒక్క కొబ్బరి బోండం ఖరీదు రెండు రూపాయలు, కానీ వాడు చెప్పిన రేటు పన్నెండు రూపాయలు, ఆరు సంవత్సరాలలో ఇంత మార్పా అనిపించింది. ఇటువంటి షాకులకి మెంటల్గా సిద్దపడాలనుకున్నాను. ఆ మహసముద్రం లాంటి ట్రాఫిక్ ని ఈదుకుంటూ షాపింగ్ చేసాం,రాత్రి ఎవ్వరూ సరిగా భోంచేయలేదేమో అందరికీ ఆకలి దంచేస్తుంధి వేరే ఆలొచన లేకుండా ఒక మంచి హొటల్ చూసుకొని అక్కడ తిస్ట వేసాం.ఇండియా వంటకాల వాసనకి నా ఆకలి రెట్టింపయింది, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకెంతొ ఇస్టమైన హైదరాబాద్ ధం బిరియానీ ఆర్దర్ చేసాము.మహాప్రభో బిరియానీ ఎంత రుచిగా ఉందంటే కేవలం బిరియానీ కోసమే ఇందియాలొ ఉండిపోవాలనిపించింది. మేము షాపింగ్ ముగించుకొని ఇంటికి చేరేసరికి దం గాడు, కుమర్ గాడు మాకొసమే ఎదురుచూస్తున్నరు. ఈ ఆరు సంవత్సరాలలొ వాళ్ళ రూపు రేఖలు పూర్తిగా మారాయనిపించింది.చిన్నా వాళ్ళింట్లోనే భొజనాలు కానించి ఫణీ, నేను నరసరావుపేట కి బయలుదేరాం.నాకు బాగా అలసటగా అనిపించి బస్సు బయలుదేరగానే నిద్రకి రెడీ అయ్యను యం.పి.3 లొ నుంచి రైటో, లెఫ్టో అంటూ పాట వినిపిస్తూ ఉంటే వింటూ నిద్రలోకి జారుకున్నా. బస్సు కండక్టర్ పేట.., పేట అన్న అరుపులతొ మెలుకువ వచ్చింది, చూస్తుండగానే మేము దిగవలసిన స్టాపు వచ్చింది.లగేజి తీసుకొని దిగేసరికి ఎదురుగా మా బావగారు కారుతో రడీ గా ఉన్నారు.కారు బయలుదేరింది, నాకెంతో పరిచయమయిన రొడ్లమీద అలా అన్నీ గుర్తు పట్టడానికి ప్రయత్నించి ఫేయిల్ అయ్యను, అంతా మారిపోయింది నేను వింటూ ఉన్నది నిజమనిపించింది. నిజానికి మాది చిన్న పల్లెటూరు అక్కెడే ఎంతో మార్పు కనిపించింది.ఇంటికి వెల్లేసరికి నా రాక కొసం అంతా ఎదురుచుస్తూ ఉన్నారు, అమ్మ,నాన్న ఊరినుంచి వచ్చిన అక్క, చెల్లి వాళ్ళ ఫామిలి అందరినీ చాలా సంవత్సరాలుగా చుడకపొవటం వల్లేమొ వాళ్ళని చూడగానే నా కళ్ళళ్ళో నీళ్ళు నిండాయి, అది ఒక్క క్షణమే ఆ తరవాత వాళ్ళ పలకరింపులతో అంతా కొలహలంగా మారిపోయింది. నా ఆరు సంవత్సరాల అమెరికా జీవితంలొ అటువంటి మధురమయిన సంఘటన ఒక్కటీ ఆ క్షణంలో గుర్తుకు రాలేదు…..నాకు ఆచ్చర్యమనిపించింది!. అలా కొన్ని గంటలపాటు ఎవో ముచ్చట్లు జరుగుతూనే ఉన్నాయి మధ్య మద్యలో అత్త వరుస, పిన్ని వరుసయిన వాళ్ళు వచ్చి చూసి వెలుతున్నరు, ఈ లొగా స్నేహబ్రుందం రానే వచ్చింది, అందరి కళ్ళళ్ళో తెలియని ఆనందం అందరం కలిసి అమ్మచేతి కమ్మని కాఫీ తాగాం.నేను కొత్తగా వచ్చాను గాని వాళ్ళకి ఎప్పుడూ చేసే పని ఉంటుందికదా, మళ్ళీ కలుస్తామని చెప్పి అంతా వెళ్ళిపొయారు. చిన్నప్పటి నుంచి హనిమి గాడికి నెనంటే కాస్త ప్రేమెక్కువే,మేము చదువుకొనేటప్పటినుంచే నెనేదో సాధిస్తానని నమ్మినోడు, ఇవాళ నేను వచ్చినందుకు వాడికి చాలా ఆనందంగా ఉంది. కానీ వాడికళ్ళళ్ళొ ఎక్కడో చిన్న అసంత్రుప్తి కదలాడింది, బహుసా వాడు కూడా ఇలాగ చదవలే కపొయినందుకేమో. కొద్ది సేపటి తరువాత చెల్లి పిల్లలు కాలేజే నుంచి వచ్చారు రాగానే నా ఆసీర్వాదం కొరి నమస్కరించారు, వాళ్ళ వినయ విధేయతలు చూసి అనిపించింది అచ్చు వాళ్ళమ్మ గుణాలే వచ్చాయని. ఇదంతా మా నాన్న దూరంగా కూర్చొని గమనిస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇటువంటి ఆనంద క్షణాలు మిస్సయినందుకు బాధని గుర్తుచేసుకుంటూనే, ఈక్షణం లో పొందుతున్న ఆనందానికి సంతొషంగా కనిపించాడు.అమ్మ చేతి వేడి వేడి ఇడ్లీలు తిని సిటీకి బయలుదేరాను.
* * *
అలా రెండురోజులు గడిచాయి, ఉదయాన్నే ఊళ్ళో ఉన్న బంధువులని కలవటం లంచ్ తరవాత పేటకి వెళ్ళి ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టటం. మేమంతా ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవలు రానే వచ్చాయి. వాటితొపాటు ఎక్కడెక్కడో చదువుతున్న స్టూడెంట్లని, హైద్రాబాదులో జాబ్ చేస్తున్న కుర్ర వాళ్ళని కూడా ఊరికి పట్టుకొచ్చాయి. వాళ్ళ రాకతో ఒక్కసారిగా ఊరిలొ ఉత్సాహం ఉరకలేసింది, అప్పటివరకు నెమ్మదిగా జరుగుతున్న పనులలో వేగం పెరిగింది, వాళ్ళందరి ముచ్చట్లతో నేనుకూడా బిజీ అయిపొయ్యాను. కుర్రవాళ్ళు సంక్రాంతి పండగ సందర్భంగా జరగాలిసిన కార్యక్రమాల ప్రణాలిక చేయటంలో మునిగిపోయారు.ఎన్నొరోజులనుంచి సంక్రాంతి పండుగకోసం ఎదురుచుస్తున్న ఊరి ఆడబడుచులు కుటుంబసమేతంగా వచ్చిచేరారు. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు, పనులుచేసుకునే కుర్రవాళ్ళు ఈసారి త్వరగా పొలం పనులు అయిపోవటంతో అందరితో బజార్లు కళ కళ లాడాయి. ఇటువంటి పల్లె వాతావరణం లో గడిపి 15 సంవత్సరాలు పయినే అయింది , అందుకేనేమో అక్కడ కనిపించిన ప్రతివక్క సన్నివెశాం నా మనసుకి హత్తుకున్నట్లు అనిపించింది .అందుకేనేమో అందరూ అంటుంటారు “పల్లెల్లో అభిమానాలు, ఆప్యాయతలు ఉంటే – పట్టనాలలో ఆర్భాటాలు, అగచాట్లు” ఉంటాయని.
* * *
మేమందరం ఊరికి వచ్చిన సందర్భంగా ఊళ్ళో ఉన్న కుర్ర వాళ్ళందరినీ ఒక చోట సమావేస పరిచారు.మేము తలపెట్టబొతున్న ట్రస్టు గురించి, కమిటీ మెంబర్లు కూలంకుషంగా వివరించి చెప్పారు, దానికి మాత్రుభూమి చారిటబుల్ ట్రుస్ట్ అని పేరుపెట్టి, ఆందరి నిర్నయం తో ఊర్లో మంచినీటి కుళాయి(వాటెర్ పుఎరిఫికషన్ పధకం) ఎర్పాటుకి నిర్నయించారు,పిల్లల చదువుకి ప్రయివేటు, అలాగే బ్లడ్ టెస్టులు, కళ్ళ పరీక్షల ఎర్పాటుకి తీర్మానించారు. ఊరికి జరగబోయే మంచిని ఊహించికొని అక్కడ ఉన్న అందరి మొహాలలో ఆనందం వెల్లివిరిసింది. దానిలో భాగంగా ట్రస్టు సభ్యులు సంక్రాతి వేడుకలు ఘనంగా నిర్వహించి చదువుకున్న పిల్లలికి , కుర్రవాళ్ళకి బహుమతి ప్రధానం చేసారు. ఊరి పెద్దలు అంతా కలిసి చందాలు వసూలు చేసి రామాలయము, పిల్లలికి చదువుకోవటానికి బడి, ఫేపరు చదుకోటానికి పెద్దలికి గ్రంధాలయము కట్టించ్చారు. మంచి రోజులు వస్తే అంతా మంచే జరుగుద్ది అనటానికి నిదర్సనంగా ప్రభుత్వం ఊరిలో సెమెంటు రోడ్డులు వేయించ్చారు. ఈన్ని విధాలుగా అభివ్రుధ్ధి చెందుతున్న మా ఊరిని చూసి సంత్రుప్తిగా అమెరికాకి తిరిగి ప్రయానమయ్యాను.
* * *
హైదరాబాదు ఏర్పొర్టు లో అడుగు పెట్టే సరికి అప్పుడే..… ఆ అమ్మాయి టాక్సీ దిగుతుంది, అంతే ఒక్కసారిగా నాకు నిద్ర ఆవహించింది..