Saturday, May 2, 2009

అమ్మా నాన్నా ఓ తెలుగబ్బాయి

రేవంత్ కి చాలా అసహనం గా అనిపించింది. ఒక సారి వాచ్ వైపు చూసుకున్నాడు, 9 అవుతుంది అంటే తను వెళ్ళవలసిన చోటు చేరుకోవటానికి ఇంకా మూడు గంటలు సమయముంది, కానీ ఎక్కడో చిన్న డవుటు సమయానికి చెరుకొగలనా లేదాని. మొదటిసారి రేవంత్ కి అనిపించింది మనిషికి రెక్కలుంటే బాగుండని ఎంచక్కా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చని, చేసేదిలేక అసహనంగా అలా పేపరు చదువుతూ కూర్చుండిపోయాడు. నిజానికి రెవంత్ కి ఈరోజు చికాగో లో ఒక పెద్ద కంపనీలో ఇంటర్వూ ఉంది, వాతావరణం సరిలేకపోవటం వల్ల తను బయలుదేరవలసిన ఫ్లయిటు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది,అందుకే రేవంత్ ఫ్లయిటు వేగం కంటే ముందుగా ఆలోచిస్తున్నాడు.తను ఈరోజు అటెండవబోయే ఇంటర్వూ పాస్ చేయగలిగితే తన శాలరీ ఒక్కసారిగా డబుల్ అవుతుంది,ఈ అలోచనే తనని సీటులో కుదురుగా కూర్చోనీయటంలేదు. రేవంత్ అమెరికా వచ్చి సరిగ్గ ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతుంది, ఈ ఆరేళ్ళలో ఎన్నో కంపనీలు మారాడు, అలా మారిన ప్రతి సారి తన శాలరీ పెరుగుతూ వచ్చింది.రేవంత్ కంపనీ మారిన ప్రతిసారి ఇళ్ళు మారవలసి వచ్చేది ఒక్కోసారి ఊరుకూడా మారవలసి వచ్చేది.శాంతి కి అప్పుడు చాలా కస్టంగా అనిపించేది, ఒక పక్క కొడుకు ఆర్యని చూసుకొవటం ఇళ్ళు సర్దుకోవటం చాలా కస్టమనిపించేది,కానీ రేవత్ మనసు తెలిసిన భార్య గా తను ఎప్పుడు తన బాధల్ని ఎప్పుడూ తనతొ పంచుకోలేదు , ఒకవేళ చెప్పినా తనకి ఎదురయ్యే సమాధానం తెలుసు. ఆందుకే తనే సుర్దుకుపోతుంది. శాంతి ఎప్పుడూ ఒక్క విషయం గురెంచే ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు రేవంత్ లో ఇంత మార్పు వచ్చింది , తమ పెళ్ళినాటి రేవంత్ కి ఇప్పటి రెవంత్ కి చాలా మార్పు గమనించింది. తను ఇప్పుడు అంతా దబ్బు తోనే చూస్తున్నడు, ఏమి మాట్లాడినా డబ్బు అన్న మాట దొర్లకుండా ఉండదు. ఆమెరికా వచ్చినదగ్గిరనుంచి తమ లైఫ్ అంతా మంచు లోనే గడిచిపోయింది. అసలే అమెరికాలో మనిషికి మనిషి సంబంధమే ఉండదు, అందునా ప్రతి ఆరు నెలలకొకసారి కంపనీ మారటం వల్ల తెలిసిన వారంటూ లేకుండా పోయారు, డెట్రాయిట్ లాంటి మంచు వాతావరం లో ఉండటం తెలిసినవాళ్ళు లేకపోవటం వల్ల ఆర్య కి మూడు సంవట్సరాలు వచ్చినా మాటలు ఇంకా పూర్తిగా రాలేదు. ఆసలు వాడు మాటలు నేర్చుకోవాలంటే బయట ప్రపంచం చూస్తేకదా, రేవంత్ కి ఇఎవేమె పట్టవు , తన ఆలోచనంతా ఎలా ఎక్కువ సంపాదించాల అని ఉంటుంది, ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు రేవంత్ పుట్టిన రోజు, అదిగూడా గుర్తులేనంతగా ఆలోచిస్తున్నాడు, ఏంటి ఈ డబ్బు మనిషిని ఎంతగా మారుస్తుందా ….

ఈ రోజు రేవంత్ ఉదయాన్నే బయట పడే సరికి శాంతి కూడా ఆర్యాని నిద్రలేపి త్వరగా రెడీ చేసి తన పనులలో మునిగిపోయింది.

* * *

అనుకున్నట్లుగానే రేవంత్ ఫ్లయిటు కాస్త ఆలస్యంగా చికాగో చేరుకుంది ,అందరికంటే ముందుగా దిగి ప్రపంచం ఆగిపోతున్నట్లు రేవంత్ పరెగెత్తుకుంటూ వెళ్ళి క్యాబ్ లో కూర్చున్నాడు,తను అనుకున్న దానికంటే 30 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. రేవంత్ ఊహించిన విధంగానే ఇంటర్వూ పాస్ చెసాడు, IBM కంపని లో పెద్ద పోస్టు దానికి తోడు పెద్ద శాలరీ, రేవంత్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన తోటి కొలీగ్స్ కి ఫొన్ చెసి ఈ షుభవార్త షేర్ చేసాడు.రేవంత్ ఆనందం రెట్టింపయింది. తనకి పెరిగిన శాలరి గురించి కంటే , తనకి పెరిగిన శాలరీ ని వాళ్ళతో షేర్ చేసినందుకు ఎక్కువ ఆనందం కలిగింది.శాంతి కి కాల్ చేసి మాట్లాడాడు, తన ఆఫెరు గురించి , తాము ఉండబోయె హౌసు కూడా చూసినట్లు చెప్పాడు ,తను వచ్చే సరికి రాత్రి 9 అవుతుందని చెప్పాడు. శాంతి కి అర్దమయిపోయింది మళ్ళీ సర్దడం మొదలు పెట్టాలని.శాంతి ఆర్యాకి స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోపెట్టే సరికి 9 అయింది,హాలులోకి వస్తుండగా డోరు బెల్ మోగింది, శాంతి తలుపు తీసింది , రేవంత్ వచ్చాడు, వస్తూనే కొడుకు గదిలోకెళ్ళి నిద్రబోతున్న ఆర్యాని ముద్దాడాడు. చెక చెకా స్నానం చేసి వచ్చేసరికి శాంతి వడ్డించింది.శాంతి చాలా రకాల వంటకాలు చేసింది.అవి చూసిన తర్వాత గానీ గుర్తుకు రాలేదు ఈ రోజు తన పుట్టినరోజని..

* * *

రామనాధం గారు ఆరుబయట వాలు కుర్చి వేసుకుని పడుకుని ఉన్నారు . ఎందుకో పదే పదే ఇంటి లోపలికి చూస్తున్నాడు,చప్పుడేమీ రాకపోయేసరికి చిన్న నిట్టూర్పుతో మళ్ళి కుర్చీలో సర్దుకొని కూర్చుంటున్నారు. ఏంతసేపు ఎదురు చూసినా లోపలనుంచి సుశీలమ్మ బయటకి రావటంలేదు, ఈమె ఎప్పుడూ ఇంతే , ఎప్పుడూ ఏదో ఒకటి సర్దుతూ ఉంటుంది అంటూ సుశీలమ్మ బయటకి రానందుకు విసుక్కున్నాడు.తనతో చాలా మాట్లాడాలనుకున్నాడు. రేవంత్ గుర్తుకు వచ్చాడు, ఈటైములో వాళ్ళు ఎంచేస్తుంటారో, రేవంత్ ఆలోచన రాగానే మనసంతా ఆలోచనలతో నిండిపోయింది , ఒక్కసారి రేవంత్ తో గడిపిన ఆనంద క్షణాలు గుర్తుకు వచ్చాయి, ఆ వెంటనే తను వాడిని మిస్సౌతూ పడే బాభ గుర్తుకు వచ్చింది.వాడు ఇంతకముందులాగ తమతో మాట్లాడటం లేదు,ఎప్పుడయినా వాడికి చేయాలనిపించినప్పుడు మాత్రమే ఫొన్ చేస్తున్నాడు.కన్న కొడుకుని చూడాలని మనసుపడే బాధ ఒక్క కన్న తల్లిదండ్రులకి తెలుస్తుంది గాని కన్న కొడుకు కూతుర్లకి ఎప్పటికీ తెలియదు. ఆలా ఆలోచనలలో పడి పడక కుర్చీలో వాలిపోయాడు.సుశీలమ్మ ఇల్లు సర్దుకొని వచ్చేసరికి మాస్టారు నిద్రపోతూ కనిపించారు.తనకి కూడా ఆరోజు పని ఎక్కువ కావటం మూలాన అప్పటికే వేధిస్తున్న మోకాళ్ళ నొప్పులు ఇక ఏమాత్రం కదలడానికి వప్పుకొవటం లేదు, అతి కస్టం మీద ఇద్దరి మంచాలు వేసి అలా నడుం వాల్చింది, బాగా పని వత్తిడి వల్ల వళ్ళంతా నొప్పులుగా ఉంది, అలా నులక మంచం మీద పడుకునే సరికి నులక గరుకు దనం,బొంత మెత్తదనం కలిసి చాలా హాయిగా అనిపించింది , అలానే పడుకునిడి పోయింది,తల పైన ఇంటి కప్పుకి అంటిపెట్టుకున్న సీలింగ్ ఫాన్ వీధి లైటు కాంతిలొ మినుకు మినుకు మని మెరుస్తూ తిరుగుతుంది.అలా తిరుగుతున్న ఫానుని చుస్తూ తను కూడా ఆలొచనలలో మునిగి పోయింది....

* * *


రామనాధం గారు పేపరు పట్టుకొని దాదాపు పడిపోతున్నట్లుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు,అది చూసి సుశీలమ్మ గాబరా పడ్డది ఏంటి ఏమయిందంటూ ఇంట్లొనుంచి బయటకి వచ్చింది.ఆయన మొఖం లొ అంతటి ఆనందం చూసి చాలా రోజులైంది. రామనాధానికి ఆనందంతో మాటలు రావటం లేదు, అతికష్టం మీద ఆనందాన్ని అణుచుకుంటూ తన చేతిలొ ఉన్న పేపరు చూపించాడు.సుశీలమ్మ గారి ముఖం లో కూడా అనందం వెల్లివిరిసింది, ఆ కన్న మనసు ఆనందం తో కళ్ళు చెమర్చాయి, ఈ రోజు పేపరు లో తన కొడుకు ఫోటో వేసారు,తన కొడుకు యం సెట్ పరీక్షలొ రాష్ట్రం మొత్తం మీద మొదటి రాంకు సంపాదించాడు,అందుకే వాళ్ళిద్దరూ ఆ వార్త చూసేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి ఔతున్నారు.రామనాధం పరుగు మీద ఇంకా నిద్ర పోతున్న కొడుకుని నిద్ర లేపటానికి పరుగు,పరుగున ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే ఊళ్ళో చాలా మందికి ఆ వార్త తెలిసిపోయింది,ఒక చిన్న పల్లెటూరు నుంచి అటువంటి ఘనత పొందినందుకు, పైగా ఇది సాధించింది తమ మిత్రుడు, రామాపురం మాస్టారుగారి కొడుకు ఐనందుకు ఈ ఘనత మొత్తం ఊరికే గర్వకారణమని అందరూ కొనియాడారు.ఇంతటి విజయాన్ని సాధించినందుకు రేవంత్ ని ఆ తల్లిదండ్రులు ముద్దులతో ముంచెత్తారు.రేవంత్ తల్లిదండ్రుల దగ్గిర ఆశీర్వాదం తీసుకొని,ఈ సంతొషాన్ని స్నేహ బ్రుందంతో పంచుకోవటానికి బయటకి పరుగు తీసాడు.రేవంత్ చిన్నప్పటి నుంచి కూడ తల్లి దండ్రులన్నా బంధువులన్నా ఎక్కువ ప్రేమాభిమానాలు చూపేవాడు, తండ్రి స్కూల్ మాస్టారు కావటం వల్ల కూడా మంచి అభిరుచి, అలవాట్లు అలవడ్డాయి. మొదటి ర్యాంకు కావటం వలన రేవంత్ కి హైదరాబాదు లో చదవటానికి అవకాశం వచ్చింది , హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో చేరాడు.

* * *
మొదటి సారి తమ ఊరు వదలి వెళ్ళి చదువుతుండటం వల్లేమో,వాడికి హైదరాబాదు కొత్త చేసింది.దాంతో నెలకి ఒక్క సారయినా ఇంటికి రాకుండా ఉండేవాడు కాదు,అలా నెమ్మదిగా అలవాటు పడి పొయాడు, ఇప్పుడు ఆరు నెలలకి ఒక్కసారి వస్తున్నాడు . చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గదిచిపొయాయి, రేవంత్ ఈ నాలుగు సంవత్సరాలలో చాలా ఎదిగిపొయాడు, చాలా విషయాల మీద పట్టు సంపాదించాడు. జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరాలనే కొరిక పెంచుకున్నాడు,అతని ఆలోచనలకి తోడుగా ఇండియాలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చ్చాయి, ఉద్యొగం కొసం వెతికే అవసరమే లెకుండా పోయింది, ఏన్నో కంపెనీలు కాలేజి కాంపసు కి వచ్చాయి, రేవంత్ మొదటి గా వచ్చిన IBM కంపెనీలో చేరాదు, నెలకి మూడు లక్షలు బెంగులూరులో ఉండాలి.ఈ వార్త అమ్మా నాన్నకి ఫొను చేసి చెప్పాడు, కొడుకు చేతికంది వచ్చినందుకు రామనాధం, సుశీలమ్మలు చాలా పొంగిపోయారు.త్వరలో వాళ్ళ కష్టాలు తీరబొతున్నందుకు వాళ్ళు ఎంతగానో ఆనందపడిపొయారు.రామనాధం ఒక విషయాన్ని గమనించాడు,తన స్కూల్ మాస్టారు ఐనప్పటికీ తను ఎప్పుడు గూడా అమ్మ నాన్నలకి దూరంగా ఉండింది లేదు,ఒక్కోసారి ట్రాన్స్ఫర్ కారణంగా ఇరవయి మైళ్ళ దూరం వెళ్ళవలిసి వచ్చేది అటువంటి సమయంలో కూడా తను ఎన్నడూ తన తల్లిడంద్రులకి దూరం పోయిందిలేదు. అదెంటో సాయంత్రం అయ్యేసరికి నాన్నని చూడ కుండా ఉండలేకపోయేవాడు,కాని ఇప్పుడు తన కొడుకు చదువు కోసం నాలుగు సంవత్సరాలు తనకీ,సుసీలకీ దూరంగా ఉందవలసి వచ్చిందికానీ వాడు ప్రతి పండుగకీ లేదా ప్రతి నెలకీ రావటం వలన తనకి కూడా పెద్ద బాధ అనిపించలేదు, కానీ ఇప్పుడు బెంగుళూరు కి మారిపోతున్నాడు,కొడుకు తమకి దూరంగా ఉందవలిసి రాబోతుందని ఊహించాడు,తమ నుంచి రేవంత్ ని ఎవరో దూరం గా తీసుకుపోతున్నట్లుగా ఫీల్ అయ్యాడు .కానీ మళ్ళీ అనిపించింది తన కొడుకు ఇన్నాళ్ళ చదువుకి తగ్గ ప్రతిఫలం పొందబోతున్నాడు, అయినా నాకు చూడాలిపించినప్పుడు నేను వెళ్ళొచ్చు లేదా వాడినే రమ్మని చెప్పొచ్చు అయినా అనుకొవటానికిగానీ వెళుతుంది వాడేమయినా అమెరికానా?

* * *

అనుకున్నట్లుగానే కొదుకు బెంగుళూరులో చేరాడు మొదట్లో రేవంత్ ప్రతినెలా ఊరికి వచ్చేవాడు, పోను పోను రేవంత్ తన జాబులో బిజీ అయాడేమో ఊరికి రావటము తగ్గింది.రామనాధానికి తన కొడుకు కస్టపడుతున్నాడని అర్ధమయింది,రేవంత్ కి పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టాడు.కొద్దిరోజుల్లోనే హైదాబాదులో ఉంటున్న శాంతి తో పెళ్ళి కుదిరింది.శాంతి వాళ్ళ ఫామిలీ తో ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి, తెలిసిన వాళ్ళూ కావటం వలన రామనాధం,సుసీలమ్మలు అనందపడ్డారు.రేవంత్ తన పెళ్ళి చాలా వైభవంగా చేసుకున్నాడు,బెంగుళూరులో ఒక మంచి ఇళ్ళు అద్దెకి తీసుకొని తమకి కబురు చేసాడు.మొదటిసారి రెవంత్ ఫామిలీ పెడున్నాడు కనుక తను వెళితే కాస్త సహాయంగా ఉంటుందని సుశీలమ్మతో కూడా వెళ్ళాడు.అదే మొదటి సారి తను బెంగుళూరు వెళ్ళటం, చాలా చలిగా అనిపించింది,అక్కడ ఉదయం పదివరకూ ఒక్కడూ బయటకి రావటంతను చూడలేదు.నాలుగు రోజుల్లో పనులన్నీ చక్కబెట్టి సుశీలమ్మతో మళ్ళా తమ ఊరికి వచ్చేసారు.ఊర్లో అడుగుపెట్టగానే ఒక్క సారి ఊపిరి వచ్చినట్లనిపించింది. అదెంటో గానీ అలవాటయిన బయట అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వచ్చే ఆ ఆనందం మరెక్కడకెళ్ళినా రాదనిపించింది.అందుకే నేమో అంటారు అమ్మ ప్రేమ,సొంత ఊరి గాలి,చిన్ననాటి స్నేహితుడు ఎన్నటికే మరువలేనివని.సంక్రాంతి రెండులెలలో ఉండటం వల్ల,శాంతి వాళ్ళు ఒకేసారి సంక్రాంతికి రావటానికి నిర్ణయించుకున్నారు.ఎప్పుడయితే మనకి రోజులు నిమిషాలలాగా దొర్లుతుంటాయో దానికి కారణం ఒకటే, మనకి ఎటువంటి కష్టాలు,ఇబ్బందులు లేకపొవటమే.రామనాధం గారి పరిస్తితి అలానే ఉంది, అలా చూసేలోగా సంక్రాంతి రానే వచ్చింది. కొత్త పెళ్ళికొడుకు,పెళ్ళి కూతురు తో వాళ్ళ ఇళ్ళు కళకళ ళాడింది, పైగా వాళ్ళ పెళ్ళీ తరవాత వచ్చిన మొదటి పండగ.పండగ మూడురోజులు చాలా అనందంగా గడిచింది.రేవంత్ వాళ్ళ ఊరువెళ్ళే ముందు రాత్రి అందరూ కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు,రేవంత్ ఏదో తనకి చెప్పటానికి ఇబ్బంది పడుతున్నాడని తండ్రి గమనించాదు. రామనాధం కొదుకుని అదే అడిగాడు,రేవంత్ ఇక దాచటం ఇష్టం లేక చెప్పాడు, తను అమెరికా వెళ్ళబోతున్నామని,కొన్ని సంవత్సరాలు అక్కదే ఉండాలనుకుంటునట్లు. ఇప్పుడిప్పుదే రామనాధం,సుసీలమ్మలు దూరంగా ఉంటున్న కొడుకు పెళ్ళి సందడితో కాస్త మరిచిపోయి కుదుటపడుతున్నారు ఈలోగా ఇటువంటి గుండెల్ని బాధించే వార్త వినవలసి వస్తుందని ఊహించలేదు, కాని వాళ్ళూ తన కొదుకుకి ఆ బాధని కనపడనీయ కుందా జాగర్త పడ్డాడు.ఒక్కసారి వంట్లో ఉన్న శక్తినంతా ఎవరో తోడేసినట్టుగా అయిపోయింది వాళ్ళకి,అప్పటివరకు చాలా ఉత్సాహంగా అనిపించిన రోజులు ఒక్కసారిగా మసక బారిపోయినట్టయింది.ఆ తరువాత రోజు రాత్రి రేవంత్ శాంతి వెళ్ళిపోయారు. అనుకున్నట్లుగానే రేవంత్ శాంతి లు నెల తిరక్కుండానే అమెరికా వెళ్ళిపోయారు.ఆ రోజు మొదలుకుని రామనాధం గారిలో చాలా మార్పులు చోటుచేసున్నాయి.ఇంతకిముందు ఊరువిషయాలు,పనులలో చాలాచక్కగా కల్పించుకునేవాడు.ఇప్పుడు ఆ ఉత్సాహం ఏమయిందో తెలియదు, ఎదో దిగాలుగా ఉండిపోవటం, మాటలు కూడా తగ్గిపోయాయి, ఎప్పుడూచలాకీగ మాట్లాడేఆయన,నలుగురిలోఉన్నాలేనట్లుగామవునంగా కూర్చుండిపోతున్నారు. ఆయన అలా ఉండటం సుశీలమ్మకి ఇన్నాళ్ళ తన జీతంలో ఎన్నడూ చూడలేదు.

* * *

అప్పుడే తన కొడుకు పెళ్ళయి ఆరు సంవత్సరాలయింది.మనవడు పుట్టికూడా రెండు సంవత్సరాలయింది.వాడిని ఫొటోల్లో చూడటమే గాని ఇప్పటికీ కళ్ళారా చూడలేకపోయారు.ఎన్నో సార్లు కొడుకుకి చెప్పింది తనకి,వాళ్ళని ఎంతగానో చూడాలనిపిస్తుందని,తిరిగి ఇండియా వచ్చేయమనీ.అడిగిన ప్రతిసారి ఎదో ఒక సమాధానం చెప్పి మాట మర్చిపోయేలా చేసేవాడు.తన కొడుక్కి తమ మీద ప్రేమ కన్నా తన సంపాదన పైనే ప్రేమెక్కువ ఉన్నందుకు బాధపడ్డది. ఎందు కంత డబ్బు మీద మమకారం పెంచుకున్నాడో,ఎందుకు ప్రేమ,అనురాగాల మీద మమకారం తగ్గించుకున్నాడో అర్ధం కాలేదు.తన కొడుకేంమిస్సౌతున్నడో తమకి తెలుస్తుంది, కానీ వాడికెలా తెలియాలి?. భగవంతుడా..!
చిన్నపాటి శబ్దం తో సుశీలమ్మ కి మెలుకువ వచ్చింది.అప్పటికే భళ్ళున తెల్లారి పోయింది,రామనాధం గారు పేపరు చదువుతూ కనిపించారు.సుశీలమ్మగారిని చూస్తూనే తన ముఖంలో ఎదో బాధని గమనించాడు, బహుసా కలత నిద్ర అయి ఉండ వచ్చని సరెపెట్టుకున్నాడు.కాఫీ పెట్టమని అడిగారు.దేనికోసమో పేపరు చదువుకుంటూ పదే పదే ఇంట్లోకి చూస్తున్నడు,కాఫ్ఫీ కప్పు చెతికిస్తునే సుశీలమ్మకి గుర్తుకి వచ్చింది,ఈ రోజు రేవంత్ పుట్టిన రోజు,అందుకే రామనాధం గారు తన కొడుకు ఫొను కోసం పదే, పదే చూస్తున్నడు.సుశీలమ్మ కి ఎమాత్రం నమ్మకం లేదు,అమ్మా నాన్నలతో మాట్లాడటం వాడికున్న సవా లక్ష పనులలో అది ఒకటి వాడికి.అలా రామనాధం చాలా సేపు ఎదురు చూసాడు, కానీ రేవంత్ దగ్గరినుంచి ఫోను మాత్రం రాలేదు.అలా రామనాధ గారు రాత్రివరకు కొడుకు ఫొను కోసం చూస్తూనే ఉన్నారు,ఇక ఎప్పటికీ రాకపోయెసరికి, ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇంట్లోకి వెళ్ళాడు వస్తూ ఒక పెన్ను, పేపరు తెచ్చుకున్నారు, ఆరు బయట పడక కుర్చీ వేసుకొని ఎదో రాయటం మొదలెట్టాడు,అలా చాలాసేపు రాసాడు,కొద్దిసేపటి తరువాత రాసినదానివయిపు ఒక్క సారి చూసుకొని సంత్రుప్తిగా లేచాడు. ఇంట్లోకి వెళ్ళి డయరి తీసి అందులో రేవంత్ అమెరికా అడ్రసు రాసి ఉంది,కవరు మీద ఆ అడ్రసు రాసి, తన దగ్గిరున్న స్టాంపుల్ని అమెరికా వెళ్ళటానికి సరిపడా అంటించ్చాడు ఒంకెన ఉన్న చొక్క వేసుకొని బయలుదేరాడు, వెనుకనుంచి సుసీలమ్మ కేక వేసింది ఈటైములో ఎక్కడికివెళుతున్నారని,రామనాధం వినిపించుకొకుండా వెళ్ళిపోయాడు.

* * *

రేవంత్ చాలా బిజీ అయిపోయాడు తను కంపనీ మారుతున్నందున ప్రస్తుతం చెస్తున్న పని త్వరగా పూర్తి చేయాల్సిన భారం పడింది. ఏందుకో తెలియదు కానీ రేవంత్ కి మొదటిసారి లైఫులో అలసిపోయినట్లు అనిపించింది. రోజూ ఇంటికెళ్ళే సరికి ఆర్య నిద్రపోతుంటాడు, ఉదయం తను బయలుదేరే సమయానికి వాడు లేవనే లేవడు, తను ఆర్యాతో ఆడుకుని రెండువారాలు పైనే అయ్యింది.రేవంత్ ఇంటికెళ్ళే సరికి శాంతి కిచెన్లో ఏదో సర్దుతుంది, ఆర్య నిద్రపోతూ కనిపించాడు,మద్యాహ్నం పని గొడవలో పడి సరిగా భొంచేయలేదు బాగా ఆకలిగా అనిపించింది, త్వరగా స్నానం చేసి భోజనానికి వచ్చి కూర్చున్నాడు,శాంతి కూడా కూర్చుంది, ఆ రోజు కబుర్లు చెపుతూ , ఆ రోజు వచ్చిన ఉత్తరం గురించి చెప్పింది. భొజనం అయిపోయిన తరువాత ఆ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. రేవంత్ ఆ ఉత్తరం వయిపు చూసాడు అది తన తండ్రి దగ్గిరనుంచి వచ్చింది, ఉత్తరం చింపి చదవటం మొదలుపెట్టాడు,అది తను కాలేజీలో రోజుల్లో తను రాసిన ఒక కాలం అది. తన తండ్రి మళ్ళీ దానిని తనకు రాసి పంపాడు.


డబ్బు మనిషి అవసరాలకోసం మనిషి శ్రుష్టించుకున్నది.మనిషి శ్రుష్టించిన డబ్బు మీద మనిషికే అధికారం ఉండాలికానీ, శ్రుష్టింపబడిన డబ్బుకు కాదు.మనం సంపాదించుకునే ఆనందం, సంపాదనే జీవితమనుకునే వారికి క్రుష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు 'చేస్తున్న ఏపనిలోనయినా నిరంతరం ఆనందం పొందటమే జీవితం'.

ఇంత చిన్న విషయాన్ని విస్మరించి జీవితం అనే వర్షాన్ని ఆస్వాదించలేక, డబ్బు సంపాదన అనే చట్రంలో చిక్కుకుని వాడి ఉనికిని మర్చిపోతున్నాడు.ఆస్తి అనేది నువ్వు ఇతరులకి చూపించుకునేది కాదు, నువ్వు అనుభవించేది. రేవంత్ చదవటం పూర్తి చేసాడు,ఒక్కసారి తల తిరిగినట్లయింది,కన్నీళ్ళతో కళ్ళు మసకబారాయి,అప్పటిదాకా ఎదో చీకటిలో ఉన్నట్లు బ్రాంతి కలిగింది,మొదటి సారి తను వంటరి తనాన్ని ఫీల్ అయ్యాడు. తన తండ్రి రాసినదాంట్లో చివరి లైను రేవంత్ మనుసుని తాకింది.మళ్ళీ ఒకసారి చదివాడు ‘ ఏదయినా మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది చేయి జారిన తరువాత దాని విలువ తెలుస్తుంది, కానీ అప్పుడు అది అందుబాటులో ఉండదు’. ఒక్కసారి పాత రోజులన్ని గుర్తుకు వచ్చాయి, ఎటువంటి వాడు తను ఎలా ఆలోచించేవాడు ఎలా మారిపోయాడు.ఇన్నాళ్ళు తను ఏం మిస్సౌతూ వచాడో ఏం మిస్సవబోతున్నదో అవగతమయింది,తన తప్పుని తనకి తెలియచేసినదుకు మనసులోనే క్రుతజ్ఞతలు చెప్పుకున్నాడు.


ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి అందరితో చాలాసేపు మాట్లాడాడు. ఛాలా రోజుల తరువాత రేవంత్ మనసున్న మనిషి లాగా మాట్లాడినందుకు అందరూ చాల ఆనందంగా ఫీల్ అయ్యారు. అందరితో తన నిర్ణయాన్ని తెలియచేసాడు,రామనాధం, సుశీలమ్మ కి ఆ వార్త విన్న రోజు పండగే అయింది....