Tuesday, August 11, 2009

"బట్టీ" విక్రమార్కుడు

అప్పుడే టెంతు పాసయి ఇంటర్లో చేరాను.ఒక్క సారి గా నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయినట్లనిపించింది.అంతా కొత్తే,కొత్త కాలేజీ కొత్తగా పరిచయమయిన వ్యక్తులు,ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయంలో నాకు ప్రతిదీ ఎంతొ కొత్త గా అనిపించటం గుర్తు.పల్లె టూరు నించి రావటం వల్ల టౌనులో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు,కానీ రోజూ ఇంటికి పోయిరావటం కుదరదు ఎందుకంటే ఫిజిక్సు కోటేస్వరరావ్ గారి క్లాసు ఉదయం ఆరుకి మొదలౌద్ది,ఆ వెటనే కెమిస్త్రి వెంకటెస్వరరావ్ క్లాసు ఏడుగంటలకి ఉంటుంది. కాబట్టి ఇంటికిపోయి రావటం కస్టమయిన పనే. క్లాసులో కొత్తగా పరిచయమయిన వాళ్ళలో కొంతమంది వేరే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఉండటం గమనించాను.వాళ్ళలో రాజేష్ కూడా నాలాగే రూం కోసం వెతుకుతున్నాడని తెలిసింది. వెంటనే అతనితో రూం వేటలో పడిపోయాం, త్వరగానే రూం దొరికింది. అప్పటివరకు నాకు బయట ఉండి చదువుకునే అలవాటులేదు, మొదట కాస్త ఇబ్బంది అనిపించినా,ఆ వాతావరణం కొత్తగా అనిపించింది.రాజేష్ తో కొత్త బ్రమ్మచారి జీవితం మొదలయింది. రాజేష్ కూదా పల్లె హీరో కావటం వల్ల చిన్న విషయాన్ని కూడ పెద్దది చేసి చూసే వాడు.నేను దాదాపుగా అదే పరిణతిలో ఉన్నాను.అప్పుడే స్కూల్ నుంచి రావటం వల్ల రూము లో చిన్న విషయాలకి కూడా యుద్దాలు జరగటం మొదలెట్టాయి,మా ఒప్పందం ప్రకారం ఒకరోజు రాజేష్ ఒకరోజు నేను కూక్ చేయాలి,కానీ రాజేష్ కి ఎందుకో కూక్ చేయటం నామొషీగా ఫీల్ అయ్యే వాడు,అందుకే వాడి వంతు వచ్చినప్పుడు చక్కగా లేటుగా వచ్చే వాడు,నాకేమో బాగా ఆకలయ్యేది,చేసేదిలేక నేనే కూక్ చేసిపెట్టేవాడిని.ఆంతచేసి కూడా చేసిన తప్పు ఒప్పుకునే వాడుకాదు, దాంతో ప్రతిరోజూ ఆర్గుమెంటే నడిచేది, ఇక ఎక్కడి చదువు, ఎప్పుడో అటకెక్కింది.దాంతో ఎలాగయినా ఆ రూం నుండి బయటపడాలని డెసైడైపోయాను.మొదటి నుంచి నాకొక నమ్మకం ఉండేది,జరిగే ప్రతి పని ఏదో ఒక మంచి మలుపుకోసమే జరుగుద్దని,సరిగ్గా అదే టైములో మా నాన్న ఎంతో ప్రేమగా కొనిపెట్టిన రిస్టు వాచ్ రూంలో పోయింది,అసలే ఎడమొఖం పెడమొఖం గా ఉంటున్న మాకు ఆ వాచితో పూర్తిగా మాటలు కరువయ్యాయి,రాజేష్ తీసాడనే నమ్మాను,నిజానికి నా వాచ్ పోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి,నేను ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉండవచ్చు,వెళుతూ ఉంటే జారి పోయి ఉండవచ్చు,రూం లోనే పక్కవాళ్ళు వచ్చి తీసుకొని ఉండవచ్చు,కానీ ఆ వయసుకి అంతకన్నా ఆలోచించలేక పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే నన్ను నమ్మి నాతో పాటు రూములో చేరిన వాడిని అనుమానించినందుకు చాలాబాధ కలుగుద్ది.నేను ముందే చెప్పినట్లు నా కధ ఆ వాచ్తో కొత్త మలుపు తిరిగింది, నా వాచ్ పోవటమేమో గానీ నాకొక కొత్త రూంలో చేరే అవకాశం వచ్చింది.అదే సిటీలో మా పిన్ని కొడుకు కూడా చదువుతున్నడు,మా వాడు ఇంటెర్మీదెట్ సెకెండ్ ఇయర్ చడువు తున్నాడు.మొదటే వాళ్ళ రూంలో చేరటానికి అడిగాను,కానీ అప్పటికే రూములో ముగ్గురు ఉండటం వల్ల కుదరలేదు.అనుకోకుండా వాళ్ళ రూములో ఒకడు ఖాళీ చేసాడు.చందు ఆ అవకాశం కోసమే చూస్తున్నాడు,వెంటనే నన్ను వాళ్ళ రూముకి మారమన్నాడు.రాజెష్ తో చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను.
రూంలో ఉండటం మొదలుపెట్టి కొద్దిరోజులే కావటం వల్ల,పెద్దగా లగేజీ లేదు,ఉన్న లగేజీ తో కొత్త రూం కి వెళ్ళే సరికి అప్పుడే చందు కాలేజీ నుంచి వచ్చాడు,నన్ను చూడ గానే పక్కనే ఉన్న వ్యక్తికి పరిచయం చేసాడు, అప్పటికే నా గురించి చెప్పడేమో తను మామూలుగానే రిసీవు చేసుకున్నాడు. అతనే బీరు, ఒహ్ సారి అది అతని ఇంటిపేరులో సగభాగం అందరూ ముద్దుగా బీరు అని పిలుస్తారు.లగేజీ అక్కడపడేసి వచ్చేసరికి చందు వేడి వేడి అన్నం వడ్డించాడు.స్యయం పాకంలో కూడా వాళ్ళు అన్నం చేసుకుంటున్నారు,పచ్చళ్ళు,కూరలు,పెరుగు లాంటివి వాళ్ళ ఊరినుండి వస్తాయి,అసలే ఉదయం లగేజీ సర్దడంలో టిఫిన్ మర్చి పోయానేమో బాగా ఆకలిగా ఉంది, ఇక ఏమాత్రం మొహమాటం పడకుండా వేది వేడి అన్నంలో అప్పుడే ఊరి నుంచి వచ్చిన తోటకూర పప్పు,వంకాయ కూర కొసరి కొసరి వడ్డించారు,నేనుకూడా మొహమాట పడలేదు కడుపు నిండా తిన్నాను.నాకా క్షణంలో అనిపించింది,ఇదీ …నా రూము, వీళ్ళు…నా స్నేహితులని.
మొదటి రోజే అయినా ఎందుకో నాకు ఆ రూములో ఎప్పటి నుంచో ఉన్నట్లుగా అనిపించింది.అదే బీరూ ని చూడటం,తను ఎక్కువ మాట్లాదే మనిషి కాదని అర్ధమయింది.డాదాపుగా నేను కూడ అదే కొవకు చెందటం వల్ల, త్వరలోనే బీరూ చాలా క్లొసయ్యాడు. మా చందు మాత్రం నోట్లో బస్సులు, కార్లు పెట్టుకున్నట్లు ఎప్పుడూ నోరు మెదపకుండా ఉండలేడు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. మరికొద్ది సేపటికి వానర సైన్యం లాగా బిల బిలా కొంత మంది వచ్చి పడ్డారు,అందరి పరిచయాలు అయిపోయిన తరువాత అర్ధమయింది నేనుండబోయె రూము మామూలు ది కాదని.వాళ్ళలో ఒకడు సన్నగా నెడితే పడేటట్లున్నాడు, నన్ను దాదాపుగా రాగింగు చేసాడు, నాకయితే కడుపులో ఒకే గుద్దు తో నా కసితీర్చుకోవాలనిపించింది.నేను మరీ భయపడటం చూసి, దొండేటని పరిచయం చేసుకుని నన్ను కూల్ చేసాడు.పైకి వాళ్ళంతా చాలా అల్లరి మూకలాగా కనిపించినా వాళ్ళంతా కాలేజీ టాపర్లు.అందుకే అంటారుఎవరిగురించయినా తెలుసుకొవాలంటే ముందు వాళ్ళ ఫ్రెండ్సు గురించి తెలుసుకుంటే సరిపొతుందని.నాకు ఎక్కడలేని ఆనందం గా అనిపించింది, ఇక నిశ్చింతగా చదువుకోవచ్చని అనిపించింది.
* * *
సాయంత్రం ఆరౌతుంది ఎవరో బెల్లు కొట్టారు వెళ్ళిచూసాను బయట ఒక వ్యక్తి గాల్లో ఆలోచిస్తూ నిలబడి ఉన్నాడు,వెళ్ళి తలుపు తీశాను,తనువాసని వస్తూనే పరిచయం చేసుకున్నాడు,నాగురించి అడిగి తెలుసుకున్నాడు,కాసేపటి తరువాత అందరం టీ కి బయలుదేరాం,సాయంత్రం అవ్వటం వల్ల రోడ్డు మీద వాహనాల రద్దీ తగ్గింది,ఎక్కువ శాతం రోడ్డు నిలబడ్డ మనుషులతో నిండిపోయింది.నాకంతగా పరిచయం లేని సెంటర్ అది,వెళుతూ ఒక చోట ఆగిపోయారు,చందు నాలుగు ఆంలెట్.. ,నాలుగు బటానీ.. అని ఆర్డరేసాడు,జనరల్ గా మనం హోటల్ కి వెళితే హోటల్ వాడు ఆర్డర్ చేస్తాడు,కానీ ఇటువంటి బండ్ల దగ్గర కస్టమర్ ఆర్డర్ చేస్తాడు.మాటల్లో తెలిసింది అది జానీ మసాలా బండని,నేనుకూడా విన్నాను,అక్కడ ఆంలెట్ మసాలా బజ్జీ చాలా బాగుంటుందని,అన్నట్లుగానే తింటుంటే స్వర్గం కనిపించింది,ఆ టేస్టు ఎందుకో గానీ చిన్నప్పుడు నేను తిన్న ఉల్లిపాయ కారం వేసి చేసిన జొన్న రొట్టెని టేస్టుని గుర్తు చేసింది,బహుశా వాడు వాడిన మసాలా మహత్యం గాబోలు.ఆ తరువాత రసూల్ టీ సెంటర్ దగ్గిరకి తీసుకు పోయారు, నాలుగు చాయి ఆర్డర్ చేసారు అందులో మలాయి వేయమని చెప్పారు.ఆప్పుడే ఆంలెట్ తినటం వల్ల నోటి కారం టేస్టుకి వేడి,వేడి టీ నోటికి తగులుతుంటే చాలా హాయిగా అనిపించింది. రోజూ తాగే టీ ఈరోజు చాలా రుచిగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది,నా ఒకటే అనిపించింది,నేను తాగుతున్న టీ కాదు నా చుట్టూ అల్లుకున్న కొత్త వాతవరణమే దీనికి కారణమని.
* * *

కొద్ది రొజుల్లోనే ఆ చుట్టూ ఉన్న మనుషులు, పరిసర ప్రాంతాలు అలవాటయిపోయాయి.మొదట్లో కొత్త ఫ్రెండ్సు బాగానే ఉంది గానీ రూంకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరగటం ఎక్కువయింది.ఏటయిములో చూసిన కనీసం అరడజను మంది బయటవాళ్ళు ఉంటున్నారు.దానికితోడు చందు,బీరు కూడ వాళ్ళతో ఎంజాయి చేస్తున్నారు,ఏదో అలా పుస్తకం పట్టుకుంటారు ఈలోగా ఎవరో పిలుస్తారు వెళ్ళి పోతారు.ఆది నాకొక పజిల్ లాగా తయారయింది,చూస్తేనేమో ఎప్పుడూ చదివిన పాపాన పోలేదు కానీ వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నట్లు అనిపించింది.నాకర్ధమయింది నేను వచ్చింది మంచి రూముకని సంబరపడి పోతే సరిపోదని,నాకు నేనుగా నా చదువు గురించి ప్లాను చెసుకోవాలని నిర్ణయానికి వచ్చాను.టెంతు తెలుగు మీడియం కావటం వల్ల నాకు ఒక సారి చదివితే గుర్తుండటం కస్టంగా ఉంది,కాదు అసలు ఎలా చదవాలో తెలియట్లేదు.వాళ్ళలాగ అలా ఇలా చదివితే సరిపోదని అనిపించింది.ఒకాసారి నేను అనుకున్నట్లు ప్లాను చేసుకున్నాక కాస్త రిలీఫ్ గా అనిపించింది.కానీ బాగా చదవాలన్న నా అతి కోరిక వల్ల నేను ఏవిధంగా నశ్టపోబొతున్ననో నాకా టైములో తెలియలేదు.ఏకాడికి బాగా చదవాలని అనుకుంటున్నానే తప్ప ఎలా చదవాలో ఆలోచించలేదు,నేనుకూడా వాళ్ళలాగ కాన్సెప్టుని అర్ధం చేసుకున్నట్లయితే నా పరిస్తితి వేరుగా ఉండేది,అలా ఆలోచించకపోవటం వల్ల బట్టీకి అలవాటు పడిపోయాను.ఇంటికి వెళ్ళి రెండువారాలు దాటింది,కాలేజీ అయిపొగానే ఇంటికి వెళ్ళిపొయాను,శని, ఆదివారాలు ఫ్రెండ్సుతో బాగా క్రికెట్ ఆడి ఎంజూయి చేసాను,దాంతో మండే కూడా కాలేజీకి పోవాలనిపించలేదు.


సాయంత్రం బయలుదేరి రూంకి వెళ్ళేసరికి రవీంద్ర వచ్చాడు.నేనడగకుండానే మొదలెట్టాడు,కాలేజీలో జరిగినదంతా చెప్పాడు,నిజానికి నే నారోజు కాలేజీకి పోకపొవటం వల్ల పెద్ద బండ నామీద పడింది,ఆరోజు క్లాసులో ఫిజిక్స్ కొటేస్వరాఉ అటమిక్ థీరీ చెప్పాడట,మామూలుగానే ఆయనకి కొపం ముక్కు మీదనే ఉంటుంది,ఆరోజు క్లాసులో ఎవడో వెనకనుంచి గుర్రంలాగ సకిలించాడు దాంతో ఆయనకి బాగా మండింది,కక్ష సాధింపు చర్య గా ఈరోజు చెప్పిన లెసన్ మీద క్లాసులో రేపు టెస్టు పెడతానన్నాడట.ఈ వార్త వినంగానే నా పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది. అసలే ఎలా చదవాలో అర్ధం గాక చస్తుంటే, ఇప్పుడేమో క్లాస్ అటెండవకుండానే చదవాలిప్పుడు.ఆ రోజు సాయంత్రం వంట చేయటం నావంతు గాబట్టి త్వరగా పూర్తి చేసుకొని,పుస్తకాలు ముందేసుకున్న,చాలా చదవాలని ఆరాటం కానీ కొంచెం కూడా లోపలికి వెళ్ళటం లేదు.నా అవస్త చూసి బీరు అడిగాడు ఏం చదువుతున్నావని, చెప్పాను రేపు కాలేగీలో టెస్ట్ గురించి, అందుకే కుస్తీ పడుతున్నాని చెప్పాను,బీరూకి నేనారోజు కాలేజీకి వెళ్ళలేదని తెలుసు, బీరు తో పాటు చందు,బక్క సీను కూడా అక్కదే ఉన్నాడు. నా మాటలకి వాళ్ళు పడి పడి నవ్వారు,బక్క సీనయితే మరీనూ.వాళ్ళు నవ్విన నవ్వులు ఇప్పటికీ నేను మర్చిపోలేను.వాళ్ళ నవ్వులేమో గానీ నాకావిధంగా బట్టీ పట్టడం పొరపాటున అలవాటుగా మారిపోయింది.ఆ రోజు నుంచి మా రూము దగ్గిరలో గబ్బిలాలు తిరగటం మానేసాయి,నేను చదివే సౌండుకి,ఆ చుట్టుపక్కలకి రావటం మానేసాయి. నా ఫ్రెండ్ కైలాష్ అంటుండేవాడు నేను చదివే టప్పుడు విన్నది గుర్తుపెట్టుకొనే చాలా మంది పాసయిపోయారని.
* * *
ఎండ్లాకాలం అవటం వల్ల పగలే కాకుండా రాత్రిపూట కూడా చాలా వేడిగా ఉంటుంది, మేముండే రూము ఫస్టు ఫ్లోరులో ఉండటం వల్ల చల్లగా, హాయిగా ఉంటుంది. అందుకేనేమో, చందు,బీరు వాళ్ళ ఫ్రెండ్సు అతి సాధారణంగా వచ్చి నైటు స్తడీ చేసుకుని అక్కడనే పడుకునేవారు. చదువు అన్న వంకే గానీ ఎప్పుడూ సినిమా కబుర్లే సరిపోయేవి, ముక్యం గా పాలపర్తి వస్తే మాత్రం మిగిలిన వాళ్ళు నోరు మూసుకొని వినటం తప్ప చేసేది ఎమీలేదు, నోరు విప్పితే అన్నీ సినిమా కబుర్లే . సరిగ్గా మా రూంకి సమానంగా పక్కవీధిలో సంధ్యా వాళ్ళ ఇళ్ళు ఉంది, ఇంతకీ సంధ్య ఎవరో చెప్పలేదు కదూ, సంధ్యా మా కాలేజీలోనే చదువుతుంది, చాలా అందంగా ఉంటుంది, మా క్లాసులో ఆ అమ్మయితో మాట్లాడటానికి తెగ ఇదయిపోయే వాళ్ళు, ఎంతంటే, ఆమె దగ్గిర నోట్సు తీసుకోవటానికి వంకకోసం క్లాసు డుమ్మ కొట్టేవాళ్ళు. అటువంటి అందాల రాసి మా రూంకి దగ్గిరలో ఉండటం ఎంత ప్రమదమో త్యరలోనే తెలిసొచ్చింది..
రోజుట్లాగానే త్వరగా డిన్నర్ ముగించుకుని, పుస్తకాలు పట్టుకున్నాను, అప్పటివరకు ఆ చుట్టుపక్కల తిరుగుతున్న గబ్బిలాలు ఒక్కసారిగా మాయమయ్యాయి, సెకెండుషొకి వెళ్ళిన మా కిష్కింద మూక బిలబీల్ మంటూ దిగిపోయారు, మొత్తం పదిమందికి పైనే ఉన్నారు, ఎవో సినిమా కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు, అప్పతికే టైము ఒకటి దాటింది నాకు కూడా అనిపించి అలా చదువుకుంటూ నేను కూడా నిద్రపోయాను, అప్పుడే నిద్రపడుతుంది సడన్ గా పెద్ద పెద్ద గా అరుపులు వినిపించాయి, వెయ్యండిరా ఒక్కొకడిని … తన్ని ఒక్కొక్కడిని కార్లో ఎక్కించండి.. అంటూ అరుస్తున్నారు, ఒక్క సారి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పోలీసులు లాటీలతో మా వీపు విమానం మోత మోగించటానికి రెడీ ఔతున్నారు, ఆ దెబ్బకి ఒక్కసారి అందరికీ నిద్ర మత్తొదిలింది. భయంతో హడావిడిగా లేచేసరికి కొంతమందికి లుంగీలు పోయాయి, అదరాబదరాగా దుప్పట్లు చుట్టుకున్నారు, మా వాసు గాడు ఇటువంటి టయిములో షార్ప్ గా ఆలోచిస్తాడు, లాయరు ద్వారా మందస్తు బెయిలు తెచ్చుకున్నట్లు, తనకి జాండీసు వచ్చిందని,కావాలంటే కళ్ళలోకి చూడమని,కొట్టగూడదని చెపుతున్నాడు,పాలపర్తి మామూలుగా అయితే పక్కవాడిని నోరు ఎత్తనివ్వడు,కానీ ఇప్పుడు ఎదురుగ్గా ఉంది పొలీసులు,ఏం మాట్లాడాలో తెలిక ఊడిపోయిన లుంగీ సర్దుకుంటున్నడు,అంతా ఏదొవిధంగా వాళ్ళ లాఠీ దెబ్బలనుండి తప్పించుకోవటానికి నానా అవస్తలు పడుతున్నారు.ఏవ్వరికీ అర్ధం గాని ప్రశ్న ఒక్కటే, అసలు పోలీసులు ఎందుకొచ్చారని. ఏంటి ఎవరయినా దొరికారా అంటూ అప్పుడే పైకి వస్తున్నాడు యస్సై, అంతమంది ని చూసే సరికి ఆ హా దొరికారా నా … అనుకున్నాడు, ఎవరు వీళ్ళంతా?, ఈ రూంలో ఎంతమంది ఉంటునారంటూ నిలదీసాడు, చందూ చెప్పొకొచ్చాడు,మా రూములో ఎంతమంది ఉంటుందీ,మిగతావారు ఎలా వచ్చిందీ, యస్సై చందూ మాటలు వింటూనే మా రూములో కింద ఫ్లోరు మీద ఏవయినా రాళ్ళు ఉన్నాయేమో చూస్తున్నాడు, రూం అవతలగా పోయి ఎదురుగ్గ అవతల వీధిలో ఉన్న సంధ్య వాళ్ళ ఇంటివైపు చూసాడు, తలకాయ అడ్డంగా ఆడించాడు, ఏమి అర్తమయిందో ఎమో గానీ వెంటనే మిగతా కానిస్టేబుల్సుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్క సారి తుఫాను వెలిసినట్లయింది.


ఆ హడావిడికి చుట్టుపక్కల వాళ్ళుకూడా లేచారు,ఎప్పుడూ లేవని మా ఒనరుతో సహా.పొలీసులు మా రూము ఒనర్సుతో ఎదో మాట్లాడారు,మా ఒనరు మా వైపు చేతులు చూపిస్తూ ఎదో చెప్పాడు,ఆయనకి షేక్ హండిచ్చి పోలీసులు వెళ్ళిపోయారు.మా రూము ఓనరు పైకి వచ్చాడు, అప్పటికే ఆ ఖంగారునుండి బయటకి వచ్చారు అంతా, మా ఓనను జరిగినదంతా చెప్పాడు.విషయమేమిటంటే ఆ ఎదురుగ్గా ఉన్న సంధ్యా వాళ్ళ ఇంట్లో వారంలో రెండుమూడు సార్లు గంపెడు రాళ్ళు పడుతున్నాయట,అన్ని రాళ్ళు ఎలా పడుతున్నయొ ఎక్కడినుంచి పడుతున్నయో ఎలా పడుతున్నయో తెలియక వాళ్ళు భయపడిపోయి పోలీసు కంప్లైంటు ఇచ్చారు,ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు,అలా వెతుకుతూ వచ్చి మా రూం మేద దాడిచేసారు.మేం చెసినతప్పల్లా రూంలో ఆ టైములో లైటు వేసి చేసి ఉండటమే,ఆ లైటు చూసి మా రూములో వాలిపోయారు.అద్రుష్టం కొద్దీ మా రూములో రాళ్ళు కనిపించకపోవటం ఒకటి, ఆ యస్సైకి ఎందుకో అంత దూరం నుండి రాళ్ళు వేయటంలో నమ్మకం కుదరలేదు,ఆ యస్సై నమ్మకమే మాకు శ్రీరామ రక్ష అయింది,అదే మాట చెప్పి మా ఓనరు వెళ్ళిపోయాడు. అందరికీ అర్దమయిన విషయమేమిటంటే ఆ పోలీసుల రాకకి కారణం నేను అప్పటిదాక చదువుకోవటమేనని,వాళ్ళు చూసిన చూపుకి నా అద్రుశ్టం కొద్ది వాళ్ళ చూపుకి భస్మం చేసే పవర్ లేదు గానీ లేకపోతే నా బూడిద గూడా దొరికేది గాదు.నేనక్కడ ఒక్క మాట మాట్లాడినా అందరు కలిసి కుమ్మేటట్లున్నారు,అంతే.. కుక్కిన పేనులా ముసుగుతన్ని పడుకుండిపోయాను, అందరూ వంతులవారీగా బాత్రూంకి వెళ్ళొచ్చారు,నా గజిని బుర్రకి రెండ్రోజులు పట్టింది అందరూ బాత్రూంకి ఎందుకు వెళ్ళారో అర్దమవటానికి, ఆ తరవాత ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా హాయిగా నవ్వుకునేవాళ్ళం.